పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/67

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 70

5. నరసాపుర వ్యాకరణము: దీనిని శ్రీ వేదం వెంకటరమణ శాస్త్రులవారు రచించిరి. వీరు శ్రీవేదం వెంకటరాయశాస్త్రిగారికి జనకులు. వీరు 1856 లో నరసాపురములో నున్నప్పుడు దీనిని ప్రకటించిరి.

ఇవియన్నియు కేవలము తెనుఁగుభాషా సంప్రదాయములను దిక్ప్రదర్శనముగా తెలుపుటకు మాత్రమే యుద్దేశింపఁ బడినవి. ఉత్తమ సాహిత్య విద్య కాధారములగు ప్రాచీన కావ్య రచనలు పరిశీలించుటకు, భాషాలక్షణ పరిపాటి తెలియుటకు సంస్కృత వ్యాకరణ విశేషములు తెలియుట యత్యంతావశ్యకము. తెనుఁగుభాషతో సంస్కృత భాషకు నవినాభావ సంబంధము కలదు. ఆ భాషా వ్యాకరణ పరిపాటిని తెలియనిదే తెలుఁగు కవుల శైలిని గ్రహించుట కష్టతరము. ఇప్పటివలెఁ గాక పూర్వకవులు సంస్కృతమున చక్కని పండితులై తెనుఁగు భాషా సంప్రదాయములను తెలిసికొని రచనలను గావించెడివారు. కాఁబట్టి సంస్కృత వ్యాకరణాభ్యాసము ఆంధ్ర వైయాకరణుల కావశ్యకమై యున్నది.

చిన్నయసూరి పై పరిస్థితులను గమనించి సంస్కృతాంధ్ర భాషావ్యాకరణ పద్ధతులను సమన్వయించి నూతన రీతిని బాలవ్యాకరణమును రచించినాఁడు. ఇది బాలవ్యాకరణ మను పేరుతో వెలసినను ప్రౌఢపండితులకు సైతము సుగమము కాదు. ఐనను చిన్నయసూరి దీని కీ పేరు పెట్టుటకు సిద్ధాంతములుగా గ్రహింపఁదగిన విషయములను సూత్రప్రాయ