పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/64

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 67

త్రయమువారి భాషయేకాని వేఱుగాదు. నేఁడు వాఙ్మయమున ప్రసిద్ధికెక్కుచున్న నన్నెచోడ పాల్కురికి సోమనాథాది శివకవుల భాషను వారు గ్రహింపనే లేదు. కాఁబట్టి లక్షణగ్రంథములు విశాలములుగాక సంకుచితములై భాషయొక్క వివిధ పరిణామములలో నొకదానిని మాత్రమే వివరించియున్నవి. కొంతకాలమునకు కవులు లాక్షణికుల నిరంకుశత్వమునకు లోఁబడి వా రంగీకరించిన ప్రయోగములతోనే రచనలఁ గావించుచు వచ్చిరి. ఇందుల కుదాహరణముగా క్రీ. శ. 1656 - వ సంవత్సరమున అప్పకవిచే రచింపఁబడిన అప్పకవీయమును గ్రహింపవచ్చును. తరువాతి రచయితలు అప్పకవీయమునే ప్రమాణముగాఁ గొని ప్రాచీన కవి ప్రయోగములను నిరసించుచు వచ్చిరి. దీనివలన భాషయొక్క స్థిరత్వము క్రమముగా సడలినది.

తెనుఁగువ్యాకరణములు సంస్కృతములో కూడ విరచితములైనవి. వానిలో నన్నయ విరచితమని చెప్పఁబడు 'ఆంధ్ర శబ్దచింతామణి'యు, అథర్వణాచార్యకృతమగు 'అథర్వణ గారికావళి'యు ముఖ్యములు. వీనిలో నాంధ్ర శబ్ద చింతామణి మిక్కిలి ప్రసిద్ధిలోనికి వచ్చినది. దీనికి ఎలకూచి బాలసరస్వతి రచించిన తెలుఁగు టీక ప్రచారములో నున్నది. అప్పకవి 'చింతామణి' నే యాధారముగాఁగొని పద్య కావ్యముగా రచించినాఁడు. కాని యతఁడు సంధి పరిచ్ఛేదమువఱకు మాత్రమే రచించినాఁడు. ఆ వెనుక అహోబలపండితుఁ డను విద్వాంసుఁడు 'కవి శిరోభూషణ' మను పేర నొక విపుల