పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/60

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 63

8. తద్ధితపరిచ్ఛేదములు గలది. ఈ విభాగమునుబట్టి యిది పాణిని అష్టాధ్యాయి ననుసరించి వ్రాయఁబడినది. గ్రంథ ప్రారంభమున ముం దీ క్రింద శ్లోకము చెప్పఁబడినది.

               "అస్తి కల్పద్రుమ:కోపి జాతరూపలతాసృత:
                వేంకటాద్రి శిఖారూఢు స్మరతాం పరమర్థద:.

గ్రంథాంతమున "సర్వం లక్షణం చిన్నయసూరీయాణి సూత్రాణి సీధాదృష్టమ్" అని కలదు. ఇదియును బాల వ్యాకరణమునకు పూర్వము రచింపఁబడినదే యగును. ఏల యనఁగా నిందలి సంస్కృత సూత్రములకు తెనుఁగు భాషా పదము లనుసంధింపఁబడినవి. అయినను వ్యాకరణ శాస్త్రము శబ్దబ్రహ్మను ప్రతిపాదించుటచేత నీతఁడు మొదటి సూత్రములనే 'ఆంధ్రభాషా సంబంధినీ సిద్ధి శ్లోకస్య వ్యవహారా దవగం తవ్యా, తర్హి శాసనమిద మనారంబనేయమిత్యాశంక్యా శాసనమితి' అని వ్యాకరణశాస్త్ర మర్యాదలేని తెనుఁగు భాషకు సంస్కృత వ్యాకరణముతో సమానమగు ప్రతిపత్తిని గడించినాఁడు. దీనినే తిరిగి సూత్రములుగా కూడ తెనుఁగున శబ్దలక్షణ సంగ్రహమున ననువదించియున్నాఁడు. సంస్కృత పదములను తెనుఁగు పదములను ఎట్లు సమ్మేళనము చేసియున్నాఁడో ఈ క్రింది యుదాహరణముబట్టి గుర్తింపవచ్చును.

                   కచటతపా: పరుషా:
                   గజడదబా స్సరళా:
                   ఉభయే కంపా: