పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/59

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 62

            గీ. అదులు పదాఱు స్వరములు కాదికములు
                ముప్పదియునాల్గు వ్యంజనంబు లనఁ దనరు
                బిందువు విసర్జనీయంబు వెలయు వ్యంజ
                నములు నన నాద్యభాష పన్నగనగేశ.

            క. ఋముఖములు నాల్గు వక్రత
                మములు ఙ ఞ శ షాక్షరములు మానిన నవశి
                ష్టములగు నలువది వర్ణము
                లమరు ద్వితీయ ప్రకృతికి నగధరనిలయా.

పై పద్యములు ఈ క్రింద సూత్రములకు వివరణములు: -

1. ఆద్యప్రకృతికి వర్ణంబు లేఁబది.

2. ద్వితీయంబునకు ఋగ్ వక్రతను ఙ ఞ శషలు ద్రిక్కనగు. ఇట ముప్పదాఱు.

3. ఋగ్విసర్గయున్ ఙ ఞ శ ష లు సమయోగంబునం గలియు. (ఇందు 48 పద్యములు మాత్రమే కలవు. కొన్ని క్రియా రూపములు మాత్రమే తెలుపుటతో గ్రంథము నిల్చి పోయినది కావున నిది యసమగ్రమని చెప్పనొప్పును. ఇదియు శ్రీ వెంకటేశ్వరునకు కృతి.)

సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము

ప్రాచీన కాలమున నన్నయాథర్వణులవలె నవీన కాలమున చిన్నయ సంస్కృత భాషలోనే సూత్రరీతిని నొక వ్యాకరణమును రచించెను. దానికే సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణమని పేరు. ఇది 1. సంజ్ఞా, 2. సంధి, 3. అజంత, 4. ఆచ్ఛిక, 5. సర్వనామ, 6. కారక, 7. సమాస,