పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/25

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 28.

స్థానమున నియమితులైరి. వీరు పనిచేయుచుండఁగా, క్రీ. శ. 1840 లో నీ కళాశాల నెత్తివేసి కంపెనీ ప్రభుత్వము వారు రాధాని యున్నత పాఠశాలను స్థాపింపఁ జేసిరి. దీనియందు విశేష మేమనఁగా, స్వదేశీయులగు వారికిఁగూడ నిందు విద్య నేర్చుకొనుట కవకాశమియ్యఁబడినది. ఇదియే నేఁటి 'రాజధాని కళాశాల' - అనగా ప్రెసిడెన్సీ కాలేజికి మూలమైన సంస్థ. క్రీ. శ. 1853 లో మదరాసు విశ్వవిద్యాలయము ప్రారంభమైన వెనుక నిది కళాశాలగా రూపొందినది. అందు ప్రథమ శాస్త్రపరీక్ష, పట్టపరీక్ష తరగతులు నెలకొల్పఁబడినవి. ఆనాఁటికి విశ్వవిద్యాలయమున కంతటికి నిది యొక్కటే కళాశాల. ఈ కళాశాలలో పూర్వమువలెనే తెలుఁగు, తమిళము, సంస్కృతము మున్నగు శాఖలయందు పండితులు కావలసివచ్చినది. కాని పూర్వపురీతిగాఁగాక యే భాష బోధించెడువా రాభాషాసాహిత్యపాఠములనే బోధింప వలసిన నియమ మేర్పడినది. అనఁగా పాఠ్యప్రణాళికలో శాస్త్రము, సాహిత్యము వేఱువేఱుగా విభజింపఁబడినవి. అయినను తెలుఁగుపండితులకు మాత్రము ఛందోవ్యాకరణాలంకారములయందు, సంస్కృతసాహిత్యమునందు నసాధారణ పాండిత్య మావశ్యకమని నిర్ణీతమైనది.

ఈ నూతనపాఠశాలయందుఁగూడ సీతారామశాస్త్రిగారే తెనుఁగుపండితులై యాఱేండ్లకాలము నిర్వహించిరి. కాని క్రీ. శ. 1847 లో నీ పండితపదవియం దొక నూతనాధ్యాపకుని నియమించు పరిస్థితి యేర్పడినది. ఈ కళాశాలలో