పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/111

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10 శాస్త్రముల యుత్పత్తి క్రమము


3. స్మృతులు 20 అనియు 36 అనియు నానావిధముగా లెక్కించెదరు. అందు మనుస్మృతి పరమప్రమాణము ప్రాచీనమయియుండును. సర్ - ఉల్లియం - జోన్సుగారిచేత నిది యింగిలీషు చేయఁబడ్డది. తక్కిన స్మృతులు దీనివలెనే యేర్పాటును సిద్ధాంతమును గలిగియున్నవిగాని యిప్పుడు సమగ్రములుగావు. మను స్మృతి కృత యుగమునకై యేర్పడినది. ఇ ట్లాయా యుగమునకుఁదగిన స్మృతి యేర్పడియున్నది. లోకాచారము శాస్త్ర విధులకుఁ బ్రతికూలమయి యుండుటఁబట్టి చిరకాలమునకు వాని యర్థముల ప్రకాశములయినవి. కాఁబట్టి శాస్త్రార్థ నిర్ణయమునకు వ్యాఖ్యాన గ్రంథ నిబంధన గ్రంథములే యిప్పుడు శరణము. (1. పీఠిక 12, 13; మార్లి 1. అవ. 192-194, 201)

శాస్త్ర
సంప్ర
దాయము
లయిదు.

4. కాలక్రమమున శాస్త్రమునకు వేఱు వేఱు సంప్రదాయములు గలిగినవి. ఆయా సంప్రదాయము ముఖ్యముగా నొక్కొక్క వ్యాఖ్యాత ననుసరించి ప్రవర్తించుచున్నది. బంగాళ దేశమందు గౌడసంప్రదాయమని, యుత్తర బేహారునందు మైథిల సంప్రదాయమని, కాశీదేశమందుఁ గాశీ సంప్రదాయమని, మహారాష్ట్ర దేశమందు మహారాష్ట్ర సంప్రదాయమని, చన్నపట్టణ దేశమందు ద్రవిడ సంప్రదాయమనియును సంప్రదాయము లయిదు గలిగినవి.