ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

iii కొలను సుబ్బేరావు పంతులు గారి గ్రంథములలోని భాషనుగురించిమ్స్ , రోజు మహేంద్రవరములో కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రలుగారి భాషగురించీ, బ్రహ్మశ్రీ డాకరు చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారి భాష గురించిన్నీ , తణుకులో ఆంధ్ర సాహిత్య పరిషద్వారిక సభలోనూ విజయ నగరముల ఉపాధ్యాయ పండిత పరిషద్వారి క సభలోనూ వ్యావహారిక భాషావాదముగురించిన్నీ చేసిన మహోపన్యాసములున్ను , అనంతపురం, చెన్న పట్నం, గుంటూరు, బెజవాడ, బందరు, రాజమహేంద్రవరము, విశాఖ పట్నం, విజయనగరం, బరంపురం మొదలయిన పట్టణాలలో అప్పుడప్పుడు చేసిన ఉపన్యాసాలున్న ఇందులో చేర్చడానికి అవకాశము కలుగ లేదు. పోటీనిగురించి ఆంధ్రపత్రికలో ప్రకటితములయిన రిపోర్టులు అసమగ్రముగా ఉన్న వి. ఆ ఉపన్యాసములకోసము వ్రాసిఉంచుకొన్న నోట్సు ఆధార ముగా చేసుకొని పంతులు గారు కొన్ని వారి పెద్దకుమారులు శ్రీ సీతాపతీ పం తులుగారుకొని వ్యాసములు వ్రాసి అచిరకాలములో ప్రకటిస్తారని భావిస్తు స్నొ ను. ఇప్పటికి సిద్దముగా ఉన్న వ్యాసములుమాత్రమే ఈ సంపు టములో చేర్చి నాను. | క వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము” “భారతి) నుంచిన్ని, కరాజరాజుకాలమందున్న తెలుగుభాష ఆంధేతిహాస పరిశోధక మండలి వారు ప్రచురించిన రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక 29 నుంచిన్ని , ప్రాఁ దెనుఁగుఁగమ్మ, “ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికి నుంచిన్ని తక్కిన వ్యాసములన్నీ శ్రీ పంతులు గారు ప్రకటించిన ఈ తెలుగు పత్రిక నుంచిన్నీ పునర్ముద్రితములయినవి. 'భారతీ పత్రికాధిపతులూ, ఆంధేతిహాస పరిశోధక మండలివారూ వారి సంచికలలోనుంచి పైన పేర్కొన్న వ్యాసములు తిరిగి అచ్చు వేసుకొనడానికి దయతో అనుజ్ఞ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞుడను. జన్మదినోత్సవ నిర్వాహక సంఘమువారికి శ్రీ పంతులు గారు తమ రచనలు ప్రకటహిర్గము ఇచ్చినందుకు వారికి ఈ సంఘముతరఫున కృతజ్ఞతా పూర్వక వందనములు సమర్పిస్తు న్నా ను. " గుంటూరు, "తేలికి చెర్ల వెంకటరత్నం , నవంబరు, 33. సంపాదకుడు.