ఈ పుటను అచ్చుదిద్దలేదు

59

రాజ రాజ కాలమందున్న తెనుగుభాష.

  రాజరాజనరేంద్రుడు కీర్తికి సమాధానముగా నన్నయ రచించిన భారతమున్నది. ఇది రాజమహేంద్రవర మందు వెలసినదవుటచేత దీనియందు అక్కడివారికి అత్యంతగౌరవముండుట ఉచితమే. వారితోపాటు తెలుగువారందరున్ను దానిని ఆదరిస్తున్నారు. అయితే  తెలుగుపాండిత్యముయొక్క దురదృష్టముచేత, నన్నయభారతము పుట్టి తొమ్మిది శరాబ్దములయినా, నిర్దుష్టమై విశ్వసనీయమైన పాఠములుగల గ్రంధము దొరకదుగదా. ఇంతవరకున్న తగిన ఉద్యమముచేసి ఈ పవిత్రగ్రంధము యధాస్దితిలోనికి ఉద్దరించక ఉపేక్షించి బాషాభిమానులు మిధ్య అని తెలుగువారికి అపకీర్తి కలుగుతుంది. మహానుభావులు, కార్యదక్షులు పట్టుదలతో పనిచేస్తే శీఘ్రముగానే ఉద్దేశమునెరవేరు తుంది. ఇప్పుడువిజృంభించిన దేశాభిమానమున్ను భాషాభిమానమున్ను వాస్తవమయితే ఈకార్యము చేంబూని కొన్నివారికి కావలసిన సాయము దొరకకపోదని నమ్ముచున్నాను.

{{{1}}}