ఈ పుటను అచ్చుదిద్దలేదు

51

రాజరాజు కాలమందున్న తెనుగుభాష

లేఖరులు తమవాడుకచొప్పున "అ" వర్ణము తప్పని దిద్దిఉంటారు. అచ్చువేయించుటకు పరిష్కరించే పండితులయినా మార్చిఉంటారు. ఇట్టిమార్పులు అనేకశబ్దములలో కలిగినవి. నేటి లోకవ్యవహారమో, శబ్దరత్నాకరమో ప్రమాణముగాచేసికొని, నన్నయ వాడిన "పొలగరుసు" శబ్దమందున్న "పొల" లోని "ల" వర్ణము లేఖకదోషమయిఉండునేమో అనిఊహించి పంతులవారు "పొలిగరుసు" దిద్దవలె నంటారు! "పొలి" శబ్దము "బలి" బలిశబ్దమట! కనుక "లి" వర్ణము సాధువు, "ల" వర్ణము అసాధువు అని వారి అనుశాసనము. అయితే నన్నయవ్రాసిన ఎనిమిది కావ్యాలలో నున్ను (ఒక్కొక్కదానిలో ఒక్కొక్కమారు) ఎనిమిదిమార్లు ఈశబ్దము ఏకరూపమున "పొలగరుసు" అనిప్రయుక్తమయి ఉన్నదే. ఎనిమిచోట్ల శాసనము చెక్కిన గండాచార్యుడు ప్రమత్తుడై "లి" వర్ణము "ల" వర్ణముగా మార్చిఉండడము సంభావ్యమా? "పొలమేర" అనిమూలమందు కాశీఖండములో శ్రీనాధుడువ్రాసినా అర్వాచీనలేఖకులు తమవాడుకలో "పొలిమేర" అనిఉండుటవల్ల ఉద్దేశపూర్వకముగా గానీ ప్రమాదముచేతగానీ ల వర్ణము లి వర్ణముగా మార్చినారనుట అసంభావ్యముకాదు. "పొలిగరుసు" అని నన్నయవ్రాస్తే గండాచార్యులు "పొలగరుసు" అని ఎనిమిదిచోట్ల మార్చుటకు కారణము నాకు కానరాదు. "పొలగరుసు" ఈ వొక్కశాసనములోనే కాదు. కలుచుంబట్టు శాసనములోకూడాఉన్నదని పంతులుగారెరుగుదురు. "పొలమేర" అని ల కారయుక్తముగానే అనేక శాసనములలోఉన్నది. క్రీ.శ.1338సం. నందుపుట్టిన దోనెంపూడి శాసనమందు (చూ.ఎపి. ఇండి.IV పు.359) "పొలమేరలు" కనబడుచున్నది. అల్లాడ వేమారెడ్డి శాసనమందు (చూ.ఎపి.ఇండి.XIII.248-250) ఆరు చోట్ల "పొలమేర" అనే రూపమున్నది. కాటయవేమని తొత్తరమూడి శాసనమందు (పంతులవారు పరిష్కరించిన పాఠములోనే) నాలుగుచోట్ల