ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

రాజరాజు కాలమందున్న తెనుగుభాష 45 కలుగవచ్చును; కనుక వారితప్పులు ప్రకటించడము తత్త్వప్రియులకు విహితధర్మము. నన్నయ భారతభాష పరిష్కర్తల దోషము చేత నిరూపించుట కసాధ్యమయి నా, నన్న యవాడిన వ్యావహారిక భాష విమర్శించి వల్లనయి నంతమట్టుకు దానిలకణము తెలుసుకోవచ్చును. భాషావిమర్శకులు శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటునిర్మాతలు, కవులు, ఆంధ్రపండితులు అని లోక మందు ప్రసిద్ధిపొందిన మ. జయంతి రామయ్య పంతులవారు స్వయముగా నందంపూడి శాసనము ఆంధ్ర సాహిత్య పరిషత్పతిక లో (చూ. 1.1) ప్రతి బింబసహితముగా ప్రకటించినారు. నన్నయ కాలపు లిపి పంతులవారివంటి వారేకాని సామాన్యులు పోల్చుకోలేరు. నన్నయ కాలపు వ్యావహారిక భాషకూడా వారివంటి పండితుల కేకాని ఇతరులకు బోధపడదు. ఇప్పటి అక్షరములతో శాసనముపొసి ముద్రించినారు. మనకు కావలసిన భాగము తెలుగువాక్యములు గలది ఎత్తి ఇక్కడ ప్రొసి చూపిస్తున్నాను. దానిలో వాకు తప్పులుగా తోచినవి తెలియజేసి పంతుల వారి " ఆంధ్రశబ్ద విమర్శ నమ” లోని గుణదోషములు విచారిస్తాను.. నందంవూడి శాసనములోని తెలుగు భాగము: 1. పూవ్వతః ఇయ్యూరియంబిల్లెమ పెద్దపూణ్ణియుం బొలగరుసున పల్లవున కొండీ1యగుంట నడుమసీమా! 2. ఆగ్నేయతః ఇయ్యూరియం బిల్లెమ పెద్దపూఱ్ఱయు నెరపులయం బొలగరుసున ముయ్యలి కుటు: సీమా! 3. దక్షిణతః ఇయ్యూరియు నెరపులయం బోలగరుసున తాడ్ల జీవ సీమా! 4. నైరిృత్యః తః ఇయ్యూరియు నెరపులయు ముందరమునయం బొలగరుసున ముయ్యలి కుటు2 సీమా! 1 కొడ్డి, 2 కుట్ర, 3 రృ,