ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

40 వ్యాసావళి రాజరాజు కాలమందున్న దిలంగుపండితుడు నన్నయభట్టు స్వయముగా రచించినవి ఈ రెండువిధములయిన వ్రాతలున్ను ఉన్నవి. భారతము కావ్యభాషను వ్రాసినది, నందంపూడి శాసనములోని గామము సరిహద్దుల వివరణము వ్యావహారిక భాషను వ్రాసినది అని ఊహించవలెను. రెండవ దానిలో ఉన్న ఎనిమిదివాక్యములనుబట్టి ఆకాలమందుకూడా ఈకాలమం దున్నట్టి భాషలో వైవిధ్య చున్నట్టు నిశ్చయించ లేము: ఎందుచేతనంటే శాసనసులోని భాష భారతములోని తెలంగువ లేనే ఉన్నది. నన్నయభట్టు రచించిన భారతములోని భాష నన్న యవ్రాసిన ట్లుగా నేడు మనము చదువుకొనే పుస్తకములలో ఉన్న దా! నన్న యవాసి నది గానీ ఆ కాలమందు వ్రాసినది గానీ ఒక ప్రతి ఆయినా నేడు మనకు దొర కదు. బుద్ధి వూర్వకముగా పండితులున్ను అబుద్ధిపూర్వకముగా మత్తు లయిన లేఖకులున్ను భాష మార్చి వేసినారని మన మందరమున్ను ఎరుగుదుమా. అప్పకవికాలమందే యిట్లు జరిగినది. వ్రాతప్రతులు చూచి పొఠమును «« పరిష్కరించి) పండితులు అచ్చు వేయిస్తు న్నారు. ఈఅచ్చుపుస్తక ముల లోని పొఠములు ఒక్కొక్కకూర్పులో ఒక్కొక్కవిధము గా మారుతున్న వి. ఆనంద ముద్రాక్షరశాలలో 1907 వ సం. నందు ముద్రితమైన గ్రంథము పీఠికలో పరిష్కర్తలు ఏమని వ్రాసినారో చూడండి. పండితులు దమకు సందిగ్గ ములుగాను మలమునకు విరుద్దములు గాను లేక న్యూనములంగాను నున్నట్టి పట్టులందుఁ దన కవనముతోఁ బాఠములను దోఁచినట్లు మార్చియుఁ గూర్చియన్నారు. కావున నీ తప్పులు ప్రథమ ముద్రణమునందలి కష్ట బాహుళ్యమునుబట్టియు గ్రంథ వైఫల్యమునుబట్టియం బెక్కులై యుండుటతోఁగూడఁ బండితుల సొంతక వనపరుంబట్టి సవరింపరానంత చిక్కులునైనవి. దీనిని వ్రాఁతప్రతులనుగొని మఱల శుద్ధముగా సవరణ సేయఁజాలిన పండితులందులకుఁ బూనకుండుటచేతనో, పూనియు దానికి వలయునంత