ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

32 32. వ్యాసావళి పురుషార్థసాధక పై, తెలుగువారి దేశభాషగా మన తాతల నాటివరకున్ను ప్రఖ్యాత మైన మనమాతృ భాష మననోటనూ మనపండితులనోటనూ అపరి హార్యమై, సదావిహరిస్తూ ఉన్నా, మన కాలమందు అయ్యో ! పరమనీచమై నింద్యమై, హేయమై, పండితుల కేకాక పామరులకున్ను, పెద్దల కేకాక పిల్లలకున్ను , నాలుగుజాతులవారికీ అస్పృశ్యులుగా ఉండి, తమ అస్పృశ్య తను తొలగించుకొనుటకు ప్రయత్ని స్తూ ఉన్న పంచములకున్ను కూడా అస్పృ శ్యమై, అవాచ్యమై, అధోగతిపాలయినది ! అహో ! కాలవిపర్యయము ! ఈపై పరీత్యము నకు మొదటి కారణము 1858–వ సం.న పరవస్తు చిన్నయసూరి పూర్వ సంప్రదాయవిరుద్ధముగా అనుశాసించిన నూతనమార్గము. అంతకు పూర్వమందున్ను, ఆకాలమందున్ను, సర్వసామాన్యముగా అందరిపిల్లలకూ కలిపీ విద్య నేర్పుటకు ఏర్పడినబడులలో, ఉపాధ్యాయులు 5 లక న్యవహా రానుసారముగా నే విద్యార్థుల చేత, మాతృభాషారచనాభ్యాసము చేయిస్తూ భాగతాది గ్రంథములలోని పద్యములు కొన్ని వాడుక మాటలలో అర్థము చెప్పి చదివించడము సదాచార మై ఉండగా, ప్రాచీన ప్రబంధస్థ మై, కేవల ప్రయోగశగణపై, పండితులకైనా బహుప్రయాససాధ్యమే, ఒక్క-ప్రబంధ నిర్మాణమునందే ఉపయోగించదగి, పండితులు మాత్రమే అభ్యసిస్తూఉండిన “గ్రాంథిక భాష” లో, అధికారానధి కారతారతమ్యము ఆలోచించకుండా, ఆబాలగోపాలం ఆందరిపిల్లల చేతనూ, రచ నాభ్యాసము చేయించ నుద్దేశించి, అందుకు సాధనము గా, అసమగము, అని గ్లాయక ము, భ్రమప్రమాదాత్మక మున్ను అయిన చిన్న వ్యాకరణము ఒక టిన్ని అస్థలితము కాని చిన్న వచన గ్రంథ మొక టిన్ని రచియించి ఇచ్చి, ఆసూరిగారు కీర్తి శేషులయినారు. కొండవీటి సీమలోని నూతులలోనుండి నీళ్ళుతోడి తెచ్చుకొని వంట చేసు కొని భోజనము చేయండి అని నా రెడు చేంతాడు, తూట్లుపడ్డ చిన్న చిల్లి