ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యాసావళి వచనాలో, ఏవి నిత్య బహువచనాలో తెలియదు. శబ్దమూ శబ్దార్థమూ తెలిసినా, కాకము సందిగ్ధముగా ఉన్న ప్పుడు ప్రయోగించుటకు పనికి రాదు. క్రియలన్ని టిక్ గాంథికాంధ్రములో (పేరణార్థక రూపము లెట్లుండునో వ్యాకరణలవల్ల గాని కోశములవల్ల గాని తెలియదు. ప్రయోగము లైనా ఒక ప్రబంధమునుబట్టి సాధువనదగినవి మరి ఒక దానినిబట్టి అసాధువు లన వలెను. భారతప్రయోగములయినే కూర్పులన్ని టీలో ఒకలాగున లేవు. ఈ కాహలక్షణము ఇట్లు పరమగహన మవుటచేత మన పూర్వులలో నైనా లెస్స" సంస్కృతాంధ్ర కావ్యములు చదివి నిరంతర భాషారచనాభ్యాసము చేసిన పండితులుమాత్రమే గ్రాంథీకాంధ్రమున ప్రబంధములు రచించేవారు. వాటిలోని మంచిచెడ్డలు వారివంటి పండితులే విమర్శించేవారు. ఇది సంస్కృతమువ నే బహు కాలాభ్యాసము చేసి నేర్చుకోవలసిన భాష. అన్న వస్త్రములకోసము పోటుపడనక్కరలేనివారికే సాధ్యము. పరిషత్తునారు చక్కగా ఆలోచించకుండా వట్టి గాంథికాంధ్ర భాషాభిమానముచేత ఈ కాలమందు అనేకులు నిర్దుష్టముగా (గాంథికాంధ్ర మున అనేక గ్రంథములు రచిస్తున్నారనీ, అవి చదివేవారు వేలకొలదిగా ప్రజలలో ఉన్నా రనీ” సభలలోనూ, పుస్తకాలలోను, పత్రిక లలోను, మహజ లోను ఊరూరా ప్రకటించి ప్రజలకున్న ప్రభుత్వము వారికిన్ని నమ్మకము పుట్టేటంత నిబ్బరముగా దృడీకరించి చెప్పి నారు. అయి తే, వారు చెప్పిన మాట లోకమంతా నిజమని నమ్మి నా, నేను నమ్మ జాలను. నేను విమర్శించి తెలుసుకొన్న విషయము నిర్మొగమాటముగా చెప్పుతాను. ఇందుకు తార్కాణ గా గొప్ప గ్రంథకర్తలని మన కాలమందు ప్రఖ్యాతి పొందినవారి నే పేర్కొని చెప్పగలను. గ్రంథకర్త పేరు విని భ్రమ ప్రమాదములకు లోనుగాక, ఆయన గ్రంథము సవిమర్శము గా చూచినవారు నా మాట వాస్తవమని నమ్మక పోరు. సభలో కొందరు గ్రంథక ర్తల