ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

51

200

ఆమని నభ్రముల్ గురియ నా జలధార నెడార్లుఁగూడ శో
భామహితంబు లయ్యె ; వరవర్ణిని నొక్కతెఁ గూడి శాద్వల
శ్యామలసీమ శీధుకలశంబులఁ ద్రావుము ; నీసమాధి నీ
సోమలతాళియే మొలుచుఁజూవె యెఱుంగక జాగుచేసినన్.

201

కాలమును వృథ సేయఁడు జ్ఞాని యెపుడు
ధ్యాననిష్ఠనొ, యిష్టాప్తిఁ దనరుకొఱకొ
వైభవంబుల స్వేచ్ఛాను భవముకొఱకొ
సురను ద్రావుటలో వ్యయ పఱచు నతఁడు.

202

ఆయువు పోవుచుండ "బదదాదు, బలాఖుల" రాజ్య మేల నీ
ప్రాయము నిండుచుఁడ మధురంబని చేదని భేద మేల మై
రేయము ద్రావి హాయి నిదురింపుము ; నీనెనుకే సుధాంశుఁ డే
రేయిని వచ్చి క్షీణతను వృద్ధిని జెప్పుఁ ద్వదర్థ మారయున్.

203

ఈవు నశించి పోక మునుపే సుర ద్రావుము ; దానికైపు నీ
భావవికారదుఃఖములఁ బాపును ; నీముడి జాఱిపోకముం
దే వనితాలలామనొ వరించి తదీయవరాలకంబులన్
బూవులు చుట్టి జుట్టుకొనముళ్ళను విప్పుము మోద మందుచున్.