ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

41

159

లోకవాంఛల రేవగల్ మునిఁగి యుంటి
వకట ! మృత్యువు గల దని యరయకుంటి
వూహఁదెలియుము ! నీ జగమొరులతోడఁ
బోవనున్నది చూడు ! నీత్రోవరాదు.

160

విశ్వకర్త నటంచు భావించియున్నఁ
దుదకు విడనాడె దీవు నందొఱును గూడఁ
గుయ్యిడఁగ ; నిట్టిలేమిని గూర్చినీకు
సిగ్గు రాదేమి ? యింకేమి చేయఁ గలవు ?

161

నీవు ధరాధినాథుఁ డయి యేలఁగ పచ్చితి వొక్కొ ? నాశనా
భావ మెఱుంగ కెంతయును భ్రాంతుఁడ వయ్యెద వేల మేలుకో !
నీవు ననాది లేవు ; తుది నీల్గిన నుండవు ; సర్వశూన్యమై
పోవుదు వింక నేఁడె తలపోయుము చేసెడి దేమి యున్నదో ?

162

తెలివినిబట్టి జీవితవిధిన్ నడుపం దగుఁ గాని, నీవటుల్
సలుపఁగనేర వీప్రకృతిజాణ ప్రబోధినియై సతంబు నీ
తలపయిఁ దన్ని తిన్నని పథంబునఁ జేర్చుచునుండు ; నయ్యెడన్
దెలిసికొనంగనేర్తు విది తీరని తీర్పరివై స్వయంబుగన్.