ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

5

16

అవ్యక్తంబను నీట నాటఁబడె నా ప్రారంభ బీజంబు దుః
ఖ వ్యాజాగ్ని నొనర్చెనా యుసురు లోకంబందు నేనొక్క ఝుం
ఝా వ్యామోహిత మారుతంబువలె సంచారంబుగావింతు మ
ద్దీవ్యన్మృత్తిక నేధరన్ గొనిరొ యుద్దేశింపరా దింతయున్.

17

విధి చైదంబు లెఱుంగనేరని జనుల్ విభ్రాంతి మిథ్యల్ సుధా
మధురోక్తిన్ వివరించి ప్రాచదు వనంబద్ధంబుగావ్రాసి యా
విధి విజ్ఞాన రహస్యసంపదలు సుప్తిన్‌ద్రోసి కై చేసి, సీ!
వృథగా జీవముఁ బాసిపోయిరి ధరిత్రిన్‌రోసి నిద్రింపఁగన్.

18

మరణ సుషుప్తిలోపల నిమగ్నతఁ బండినవార లింక నీ
మొఱ వినరా రదేదయిన మూర్ఖునికై వడిఁ జేరి గోరికిన్
శిరమిడి యేవరాలకొ యిసీ! మొఱవెట్టెదు వారలే యగో
చరు లయిపోయినారు, నిను సాకఁగ వత్తురె గోచరింపఁగన్.

19

మరణ రహస్యమున్ దెలియుమార్గము కష్టమటన్న నింక ముం
దర కొకరైన దొర్లి సదనంబునుదాఁటి పదంబు మోపలే
రురుతర సాధకుండొ గురువో యగపించిన నీరహస్య మిం
తెఱుఁగక లొంగిపోయి రిదియే కనుఁగొంటి విచిత్ర మంతటన్.