ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాత్మవిద్యల కాకరం బగు మహా
          జ్ఞానశక్తిని తపశ్శక్తి బడసి

తే. గీ. ధర్మమననేమి యో దెల్పి ధరణికెగసి
        అమృతకరులై బోదకాధ్యాపకులుగ
        నుండి పీఠికాపురమందు నోలగముల
        ప్రభువులైయుండి రాహి "షా" వంశభవులు.

2) ఉ. అన్నిటికన్న గొప్పమహిమాస్పదమైన మహత్మ్యముండు, నిం
        దున్నది ఆ "షతత్వ" మనె నుత్తమగ్రంథము దైవదత్తమై
        సన్నుతమై పవిత్రమయి శాసనమై నచరాచరంబులో
        నున్న రహస్యముల్ దెలుపుచున్నది యీశ్వరవాణిసృష్టికిన్.

3) తే. గీ. ఇట్టి విజ్ఞానమతము నర్థించి ప్రేమ
            పాఠములునేర్పి విజ్ఞాన ఫక్కి గూర్చి
            మానవోద్ధార కుండన మహినివెలసి
            మలినములుమాపె "హుస్సెన్‌షా" మౌనివరుడు

4) తే. గీ. ఏదొవేవెల్గు షాతత్వ నేగుదెంచి
            అందులోన హుసనుషా కృతవతరించి
            వచ్చినిలిచె తేజంబుగ వసుధయందు
            దెచ్చితిని నీకిదేయని తేటపరచె.

5) తే. గీ. వేలు లక్షలు శిష్యులు పాలుగూడి
            ప్రజ, లజ్ఞానతిమిరంబు బారద్రోలి
            భద్రమార్గమే కేశ్వరోపాసనంబు
            ననుచు చాటిరి హృదయఢక్కానుభూతి.

            పంచరత్నములు సమాప్తము.

                                                     (పీఠాచార్య)