ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ విజ్ఞాన విద్యాపీఠాశయము

శ్రీ విజ్ఞాన విద్యాపీఠమహర్షి జ్ఞానవేదమూర్తులు శ్రీశ్రీ హుస్సేన్‌షాకవి కృతంషాతత్వసంహితము యీశ్వరవాణిగా పలికి ఈశ్వరవాణిగా విశ్వమానవకోటికి శ్రీ విజ్ఞాన విద్యాపీఠ మహాసభాసభ్యులకు అమితానందముగ చేయుచు భౌతికవిధానమందు అనేక జీవిత విశేషములకులోనై విరక్తిభావము శారీరకముగా కలుగుటవలన మానసిక విశేషమును, పురస్కరించుకొని ధర్మప్రభోధమునుగావించి మానవుని మానవుడుగా మార్చుటయే యీ ధర్మముయొక్క లక్ష్యము. అనగా శ్రీ విజ్ఞాన విద్యాపీఠముయొక్క విశేషము. ఇది సృష్టివుద్భవించి, యుగయుగాలుగా, తరతరాలు సృష్టిలో శాఖోపశాఖలుగా ఏకేశ్వరోపాసనచేయుచు, కృతి, స్కృతిలో స్మృతిగాపాడుచు జాతిమత విచక్షణలేక యదార్ధమైన రసస్వరూపము శ్రీపీఠాచార్యునిమంత్రప్రభావముచేత జీవి ఆత్మపరిణామము అభౌతికమైనటువంటి దృశ్యరూపములో చిత్రించుటయే శ్రీ విజ్ఞాన విద్యాపీఠముయొక్క లక్షణము. దాని యదార్ద ధర్మ విషయము. ఇదిఆచరించి అనుసరించినవారికి అనుక్షణము లోకవిషయ వాంఛలను దూరముచేసి సంకల్ప సిద్ధిఁజేయును.

పద్య రత్న ములు

1) సీ|| తరతరంబులనుండి తాతతండ్రులుమున్ను
                    విజ్ఞాన విషయంబు వివిధవిధము
          మణులు మాణిక్యముల్ మదిని బడయునట్లు
                    సర్గపదార్ధద్వయము సంగ్రహించి
          వివిధదేశంబులు వెడలి సభ్యకులము
                    వినుతిగావించి రావిశ్వమూర్తి