ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

ఉమర్ ఖయ్యామ్

715

ఆసచెఱంగుపట్టు టడియాసయటన్న జగాన నింక వి
న్యాసవిలాససంగతి మనంబునఁ దట్టుటకైన నోపదీ
యాసవపానమత్తమతినై నిదురించుటె కర్జమైన న
య్యో సముపాసితం బయినవ్యోమము సోమము ద్రావనిచ్చునే !

716

కోరిక తీఱ నీజగముకోరినతీరున నెల్లకోర్కెలీ
డేఱిననైన వచ్చుటకునేఁగుటకై తెరలున్న, వెన్నియో
సారులు పచ్చగడ్డివలె శాద్వలవాటికఁ బుట్టి చచ్చున
ట్లారయ వచ్చియుండెద మహర్నిశ మీదృశముల్ దలంపఁగన్.

717

వనములఁ, బర్వతాల, మునిపల్లెల నెల్లెడ మెట్టినార మా
దినముల నొక్కరేని దివిఁదీర్చి ధరిత్రికి వచ్చినట్లుగా
ననుకొనలేదు ; తత్పథమునం దొకరైనఁ గృతార్థు లున్న య
ట్లును గనుపింపలేదు ; పరలోకము చేరెడు బాటసారులన్.

718

ఓయి ! ధరిత్రినుండి చనియుంటివి కొండొకనాఁడు ; నేఁడు నీ
కాయము గార్ధభాకృతినిగన్నది ; నీ నఖపంక్తి డెక్కలై
పోయెను ; నాటిగడ్డము ప్రపూతము తోఁకగ మాఱిపోయె ; నా
హా ! యిల లేరు నేఁడు నొకరైన నెఱుంగరు నిన్నుఁ బోల్పఁగన్.