ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

169

664

నుదుటను వ్రాసియున్న యొకనూకకు మించి లభింపఁబోదు ; నీ
మది విషయాభిలాషలను మాడ్చి దురాశల కేఁగ ; కీ జగ
త్సదనముమాయ ; మాయమయిసాగియుఁ గ్రమ్మఱ వచ్చిపోవుచున్
బొదలెడు ; దీనికై వగవఁబోలునె స్వాంతము తన్ను మ్రుచ్చిలన్.

665

విధి యీవిశ్వము మున్ను నిన్నడిగి తృప్తిన్ బూర్తిగావించెనే
విధిగాఁ గాఁగలదైన దింకవగవన్ విభ్రాంతియే గాదె యీ
పృధివిన్ గల్గుదినాలు సంతసముతో వీక్షించుచున్ బుచ్చుమీ
పృధువాంఛారతి నీమతిన్ నిహతిగావింపంగఁబో కయ్యయో.

666

వగవకు ముందు రాఁగలుగు బాధలకారసి ; దీర్ఘిదర్శికిన్
వగపు నతంబు గల్గు ; నదివ్యర్థము, స్వాంతము లోకవాంఛ లన్
తెగుళులఁ గాల్చివేయకుము ; తృప్తినిగాలము బుచ్చు మింతకున్
వగచినఁ బ్రాప్తమందు నొకపంక్తియు మాఱదు కోటిచెప్పినన్.

667

నేను గోరిన విధి పడనీయ దెపుడు
నింక నాకోర్కె చెల్లుటకేది దారి ?
యరయ విధివిధానంబె గత్యంతరంబు
దేనికిని మనయత్నంబు లేనెలేదు.