ఈ పుట ఆమోదించబడ్డది

78

ఉమర్ ఖయ్యామ్

306

ఇలను గష్టాలు నామదిఁ గలుగఁజేయు
మోయి నాచెడ్డను బ్రజ నొవఁ జేయు
మవని నానందమిడుము లయాంతవేళ
నీ స్వభావైక కృపఁ దేల్చుమీశ ! నన్ను.

307

ఏను భవన్మహమహిమ నిందు జనించితి నీకతంబునే
నేను ప్రవర్ధమానుడయి నిం డెనలారఁగ నూఱువర్షముల్
వూని యఘంబులన్ సలుపఁబూనెద ; నీదయ హెచ్చొ, మామకా
ధీన మఘంబె గొప్పదొ విధీ ! యిఁక నిన్నుఁ బరీక్షఁజేసెదన్.

308

చెప్పుము ! పాపముల్ నరులు చేయనివా రెవరో జగంబునన్ ;
జెప్పుము పాపముల్ నరులు చేయనిదే బ్రతుకెట్లు సాగునో ?
తప్పులు మేము చేసెదము దండన నీ వొనరింతువేని నీ
గొప్పతనంబు, మా కిడిన కొద్దితనం బన నేది యీశ్వరా ?

309

అక్కట ! కాలమెల్ల వృథయై చనె దుర్విషయప్రసక్తిలోఁ
జిక్కి నిషిద్థసేవనలఁ జేడ్పడి పాపమలీమనస్థితిన్
బొక్కి భవన్నియుక్తహితముల్ పొనరింపక ; నేఁడు నీదెసన్
మ్రొక్కఁగ వచ్చినామభవ ! మోమునఁ గజ్జల మావహింపఁగన్.