ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని బదులుచెప్పి వానికేదో కొంత ధనమిచ్చి పంపించెను.

ఈ "ఉమర్ ఖయ్యాం"యొక్క అసలు పేరు ఉమర్. కొందఱు ఉమురూ అనికూడా చెప్పుదురు గాని అది ముద్దుపేరు కానోపును. ఖయ్యాం అనునది బిరుదు (ఖయ్యాం అనగా గుడారపు నిర్మాత.) ఈ బిరుదునామములే అరబ్బీ, పారశీకవులు తమకావ్యములందు వాడుచుందురు. పూర్వసంస్కృతకవులకుఁ గూడ నిదే యాచారము. వ్యాస, వాల్మీకి, మయూర, బాణ, విద్యారణ్య, భవభూతి, కాళిదాసు, లనునవన్నియు బిరుదులే కాని యసలు పేరులుగావు అట్లే, హాఫిజు, సాది, మౌలానా రూమ్, గజ్జాలీ, ఖయాం అనియునెఱుంగవలయును. ఉమర్ ఖయ్యాం అనగా ఉమర్ అనే ఖయ్యాం అనియర్ధము. ఈతడు విద్యారణ్యునివలెఁ బెక్కుగ్రంథములను వ్రాసిన ఋషి (నానృషిః కురుతే కావ్యమ్). అం దీతని మత సిద్ధాంత గ్రంథమునకు ఉమర్ ఖయ్యామని పే రిడినాఁడు. ఈతఁడు ఇస్లాముమతస్థుఁడైనను కపిలాది సాంఖ్యమతస్థులకును, విరోచనాది చార్వాక లోకాయతమతములకును సంబంధమైన యొక సిద్ధాంతమును బ్రతిపాదించినాడు ఈతడు జ్యౌతిషమునకు బ్రధానాచార్యుఁడు. "తజ్వీమెజలాలీ" అను గొప్ప జ్యౌతిష సిద్ధాంతగ్రంథమును వ్రాసినాడు. ఇప్పటి ఇంగ్లీషుకేలండ రీతిని సిద్ధాంతములోనిదే యం గిబ్బన్ మున్నగు చరిత్రకారులు వ్రాయుచున్నారు. మఱియు నిట్టిదే "జీచ్‌ముల్కెషాహి" అనునది జాతక సిద్ధాంత భాగములు వ్రాసిన నా డీగ్రంథము,

"ఆరాయిసన్‌సఫాయిస్" అను తత్త్వశాస్త్రము (Philosophy)

"ఆల్‌జబర్" (Algebra). దీనిని అరబ్బీభాషలో వ్రాసెను. ఇది యిప్పుడు ఫ్రెంచిభాషలోఁ బరివర్తింపఁబడినది.