76 కవికోకిల గ్రంథావళి [షష్ఠాంకము
ణించెఁ గాఁబోలు!
కుశు : కాదు, కాదు; మనతల్లి మంగళసూత్రముధరించియున్నది.
లవు : [కొంతసేపూరకుండి] అన్నా తెలిసినది, తెలిసినది. మన తండ్రి యెచ్చటనో తపస్సు చేయుచుండవలయును.
కుశు : నాకేమియుఁ దోఁపకున్నది. మనకును ఇచ్చటి మునిబాలురకును చాలభేదము గనపట్టుచున్నది. వాల్మీకితాతగారు తక్కిన తాపస కుమారులకు శిక్షింపని బాణప్రయోగము మనకుమాత్రమె యేల నేర్పించిరి ?
లవు : మనలను క్షత్రియులను జేయుటకు.
కుశు : లవా, నీసమాధానము నాకు నచ్చలేదు. ఇందేదో కొంత దాపఱికమున్నది. ఎట్టులైన హటముపట్టి ఈరహస్యము నెఱుంగవలయును.
లవు : అవునవును; మనమిద్దఱమేడ్చి అన్నము దినకుండిన అమ్మ యీరహస్యము చెప్పకమానదు.
[నేపథ్యమున]
ప్రళయకాలాబ్ధి కల్లోలపటలిరేఁగి
పృథివిఁ గబళింపవచ్చెనాఁ బృథులసైన్య
మటవిఁగాల్మెట్ట భీతిల్లి యాశ్రమముల
కొక్కపెట్టునఁబర్వె మృగోత్కరంబు.
[కుశలవులు లేచి]
లవు : ఏమీ సైన్యమా ?
కుశు : ఆహా! తాతగారు చెప్పినట్లే అయినది. "నేనాశ్రమమున లేనిసమయమున రాక్షసులువచ్చి యజ్ఞవేదికలు పెళ్ళగింతురు. మునిపల్లె కొల్లగొట్టుదురు; జాగరూకులై యుండుఁడ"ని హెచ్చరించిపోయిరి. లవా,