ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ధనముండుట పరిపాటియె;
ధనమే సర్వంబుగాదు; ధనముండియు స
ద్వినియోగబుద్ధి గలిగిన
మనుజునిభాగ్యంబె లోకమాన్యత గాంచున్.
రమయు వాణియుఁ బక్షపాతమువహించి
కూర్చి రర్థంబు విద్యయుఁ గొదవలేక;
అట్టియొద్దిక యందఱ కబ్బదోయి,
జీవితార్థంబు నిరుకేలఁ జిక్కఁబట్టు !