కవికోకిల గ్రంథావళి
[రంగారావు సిగరెట్టు త్రాగుచు, కళ్యాణరెడ్డి కిళ్ళి నములుచు ప్రవేశింతురు.]
వెంకట : ఈమెకు కల్రా తగిలింది?
వెంకటే : [చివుక్కున అదరిపడి లేచి] ముందుగా చెప్పగూడదంటయ్యా, మాకాపరం ముంచడానికి చేశావా యీపని? [కఱ్ఱ భుజాన పెట్టుకొనును]
భార్య : ఈ బిడ్డకూడా ఆమెదేనా?
వెంకట : అవునమ్మ.
వెంకటే : ఇంక సాలుగాని రావే పెసంగం.
రంగా : అనదర్ రేస్ (Another race)
భార్య : పాలగ్గామాల యేడుస్తుంది.
వెంకట : మేము లోటాతో తాగిస్తే తాగలేదు.
భార్య : పాపం! నాచేతికియ్యండి, గుక్కెడు పాలిస్తాను.
రంగా : Ahǃ Devine Motherhoodǃ
కళ్యాణ : మొరటుతనం.
వెంకటే : నీకేం పిచ్చిపట్టిందా? దెయ్యం పట్టిందా? కుడిచి కూసోని కల్లరతగిలిన మనిషి బిడ్డకు పాలిస్తానంటావేమే? నీకేం చేటుకాలం?
భార్య : వుండవయ్యా, పాపం! పశిబిడ్డ ఏడుస్తుంటేను.
వెంకట : [బిడ్డను అందిచ్చును.]
భార్య : [ఒకతట్టు కూర్చుండి బిడ్డకు పాలిచ్చును]
రంగా : గ్ర్యాండ్, గ్ర్యాండ్, (grandǃ grandǃ)
వెంకటే : ఎంత గుండెలు తీసిన ఆడదానివె! మళ్ళీ మనవల్మి వూళ్లోకి రానిస్తారంటె? నువ్వేమి చావాల్నని వుండావంటె?
కళ్యాణ : ఏమంటారు? Instinct of self-preservationǃ
రంగా : విత్ వెంజన్సు (with vengeance)