కాంగ్రెస్వాలా
భార్య : [కొంచెం ముందుకు వచ్చి] ఆ బిడ్డెవరండి?
వెంకట : [రోగితట్టు చూపించి] పాపం! ఆమెకు కలారా తగిలింది
ప్లీడ , భార్య : [ఒకటిగా] కల్రా!
భార్య : ఇక రాండి. మన మీదార్నే వెళ్ళవద్దు. కార్ తిప్పమనండి. - కాసిం, [అంటూ వెళ్లును.]
వెంకట : మీ కారు కొంచెమివ్వండి. ఈ పేషెంటును (patient) సెగ్రిగేషను హౌసుకు (segregation house) తీసుకొని వెళ్ళాలె.
ప్లీడ : [ఆశ్చర్యముతో] What? Oǃ No. cholera patientǃ new model Buick Sedon - immpossible [వెళ్ళును.]
ఇంతలో గమళ్ళవెంకటేసు, ఆతనిభార్య, రెండుసంవత్సరములబిడ్డ ప్రవేశింతురు. వెంకటేసు దిట్టమైన యెదురు కఱ్ఱకు ఒక కొనన అన్నముమూట, చెంబు, సీసా, ఇంకొక కొనన అరటి పండ్ల చీపు కట్టి భుజముపై పెట్టుకొనియుండును. భార్య చంకబిడ్డను క్రింద దించును.]
వెంకటేసు : ఈ సత్రంలో కూసోని రెండు మెతుకు లేసుకొంటామే. అబ్బబ్బా! ఏంపెజ, ఏంపెజ! ఇశికేస్తే రాలటం లేదు. [కఱ్ఱ దించిపెట్టి క్రిందకూర్చుండును.]
[రోగి బాధపడును. భార్యా భర్తలు ఆమెతట్టు చూతురు. వెంకటరెడ్డి చేతిలోని బిడ్డ యేడ్చును. ఆయన లాలించును.]
భార్య : ఆమెకు ఏంజబ్బు పాపం! అట్లా బాధపడుతుండది.