కవికోకిల గ్రంథావళి
అయ్య : [టీ తెచ్చి పెట్టును.]
రంగా : మీ కోర్సు (course) పూర్తయిందా?
కళ్యాణ : [టీ గ్రుక్కెడు త్రాగి] మాకు వేఱే కోర్సేమి లేదండి; డెయిలీకోర్సు (daily course) మాత్రం వుంది.
వెంకట : మగవాళ్ళు కాబట్టి -
కళ్యాణ : ప్రొద్దున్నే లోటాడు ఆవుపాలిస్తారు. మధ్యాహ్నం రాత్రి, సాత్వికాహారం. వాళ్ళిచ్చే మామూలు చాలనివాళ్ళు సొంతంగా వంట చేయించుకొని ఎక్స్ట్రా (extra) గా తినవచ్చును. ఒకరికొకరికి ప్రత్యేకంగా గదు లుంటవి, భార్యాభర్తలు ఒకటిగా వుండవచ్చు. ఇష్టముంటే చదువుకోవచ్చు, బీచికి షికారు వెళ్ళవచ్చు.
రంగా : అయిదే మీకు ప్రొద్దెట్లా జరుగుతుందండి?
కళ్యాణ : భోంచేసిన తర్వాత పరుపుమీద వెల్లకిల పండుకొంటాము; ఆ దివ్యశక్తిని ఆకర్షించడానికి మనస్సును రిసెప్టివ్ స్టేట్ (receptive state) లో వుంచుకోవడం అభ్యసిస్తాం. ఇది మనిషికి చాలా న్యాచురల్ పొజిషన్. (natural position)
వెంకట : నిష్కర్మయోగు లన్నమాట!
రంగా : మహర్షి యేం చేస్తుంటాడండి? పుస్తకాలు వ్రాస్తుంటాడేమొ!
వెంకట : ఆశ్రమ కులాయంలో సూపర్ మ్యాన్ (super-man) గుడ్లు తయారౌతున్నాయి వాటిని పిల్లలు చేయించ డానికి పొదుగుతున్నాడు మహర్షి.
రంగా : O congress, thy name is impertinanceǃ
వెంకట : with apologies to Shakespereǃ
కళ్యాణ : నే వెళ్ళతానండి.