పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/642

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మహిసూరునకు మహీమహిళాకళత్రులై- | రి కృతేభదానధురీణు లనఁగ


గీ.

ధరఁ గులాలాన్వవాయభూతప్రసిద్ధి- | నుదయమైరి తదీయ కులోద్భవుండ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

114


సీ.

అమలాపురాన్వయోత్తముఁ డగు కాశీప- | తికిని గంగాభవానికిని సుతుఁడ
సన్యాసినామక సహితుఁడ శ్రీకాట్ర- | కోన లక్ష్మణసమాఖ్యునకు వేంక-
మాంబకుఁ బుత్రిక యగు కన్నమాహ్వయ- | పత్నితోఁ గూడి మీ ప్రాంతమునకు
నఱుదెంచి యేను గృతాంజలినై ప్రభూ | కానుక లివ్వఁగలానె నీకు


గీ.

నీ కృతి రచించితిని గొని మాకు నైక్య- | మొసఁగుమని వేడితిని నట్ల యొసఁగరాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

115


సీ.

కాకిణికామాత్రకనకంబు శ్రీకురు- | క్షేత్రమం దొసఁగు విశేషఫలము
మఱియుఁ బ్రయాగలో మకరమేళనమాఘ- | మునఁ ద్రివేణికయందు మునుఁగు ఫలము
గవిసురద్రుమపంచకంబు నా వెలయు పం- | చారామదర్శనమబ్బు ఫలము
ధృతి గయలోపలఁ బితృవర్గమునకును | బిండంబు నొకమారుఁ బెట్టు ఫలము