పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/639

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

స్వర్ణవేత్రములూని చండప్రచండులు | పరువులెత్తుచుఁ బరాబరు లొనర్ప
సరిగమపదని సుస్వరనయాభినయంబు- | లలర రంభాది వేశ్యలు నటింప
రతనంపుటారతుల్ జతనంబుగాఁ బౌర- | సారసయాన లాసక్తి నొసగఁ
గాహళ వేణు వీణా హుడుక్కా తాళ | మురజ భేరీవాద్యములు చెలంగఁ


గీ.

గోరికలు మీఱఁగా మీరు స్వారి వెడలు | హొయలు మాదృశులకు నలవియె వచింప,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

108


సీ.

మహితాలికమున భస్మము మూఁడు రేకలు | మునుకొని యెగదిగ మూఁడు కళ్లు
మెడ నొడలను జడముడులవన్నెలు మూడు | కేలునఁ గీలించు వాలునకును
మూఁడు మొనల్ గడువేడుక నీవు పూ- | జలు గొను పత్తిరి వెలయు మూఁడు
దళములు నాప్తున కలర మూఁడడుఁగులు | నాఱుమూఁడుగఁ దోఁచె నయయొ నీదు


గీ.

బ్రతుకు నాకేమి తోఁచదే గతియొ కాని | నిన్ను నమ్మినవారి కో యన్న చెపుమ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

109


సీ.

ఆహరప్రాహరమను నృశంసుఁడు కిల్బి- | షంబులు దొలఁగి ప్రశంసఁ గనఁడె