పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/636

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దండంబు నూత్నవేదండకృత్తికటీర- | దండంబు ధృతజగదండవార-
దండంబు పద్మజాఖండలస్తుతనామ- | దండంబు కోటిమార్తాండధామ-


గీ.

దండ మశ్రాంతసాత్వికోద్దండ నీకు | దండ మతిజవవద్భద్రకాండ నీకు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

101


సీ.

ఒదుఁగుచు సాష్టాంగ మొనరింప నా వంతు | నీ వంతు రయమున లేవనెత్త
నపరాధి ననుఁ గావుమని పల్క నా వంతు | నీ వంతు తప్పులన్నియు క్షమింప
దారిద్ర్య మొసఁగు మిత్తఱియన నా వంతు | నీ వంతు ధనవంతునిఁగ నొనర్ప
గద్యపద్యములు వక్కాణింప నా వంతు | నీ వంతు సావధానివయి వినుట


గీ.

పెక్కుమాట లికేటికి దిక్కు మాకు | నీవ నీవానిఁ జేసి మన్నింపవలయు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

102


సీ.

కలుఁగవే స్కాంద మార్కండేయ గారుడ | బ్రహ్మాండ నారద బ్రహ్మ విష్ణు
శివ లింగ మత్స్య కూర్మ వరాహ పద్మాగ్ని | వామన బ్రహ్మవైవర్త భాగ
వత భవిష్యదభిఖ్యయుత పురాణంబు ల- | ష్టాదశసంఖ్య రూఢముగ నందు-