పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/635

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వరడుంఠిగణపతి చరణంబులకు మ్రొక్కి | దండపాణికి వేడ్క దండమొసఁగి
భైరవునకు నమస్కారంబుఁ గాలించి | కేరుచుఁ గాశికిఁ గేలుమోడ్చి
ఘనగుహాలోకన మొనరించి గంగనీ- | క్షించి భవాని దర్శించియు మణి-


గీ.

కర్ణికాప్లావనముఁ జేసి కడఁక నిటుల | యాత్ర సలిపినవారు మహాత్ములు గద,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

99


సీ.

చంపక దేవకాంచన భూమిజ కురంట- | కాశోక నీలోత్పలాబ్జ కుబ్జ
మల్లికార్జున గిరిమల్లికానీప మ- | ధూక శిరీష బంధూక కర్ణి-
కార శామంతికా కరవీర కృతమాల | మాలతీ ద్రోణార్క మదన పారి-
భద్ర నంద్యావర్త పాటల నందివ- | ర్ధన బృహతీ దేవదారు దవన


గీ.

నాగకేసర వకుళ పున్నాగములను | బూజ నీకొనరింతు నేఁ బుష్కలముగ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

100


సీ.

దండంబు మిహికాంశుఖండరాజన్మస్త- | దండంబు మేరుకోదండహస్త-
దండంబు నిష్ఠురకాండకల్పిత శౌరి- | దండంబు పరిభూత దండధారి-