పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/625

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రవణాది ధీంద్రియోజ్జ్వలపంచకంబు వా- | క్ప్రముఖ కర్మేంద్రియపంచకంబు
నలి మనోబుద్ధిచిత్తాహంకృతి చతుష్ట- | యంబు జీవాత్మసమావృతమగు
పంచవింశతితత్త్వభాగ్దేహినివహహృ- | ద్వనమధ్యముల నీవారశూక-


గీ.

విధమున నజస్రమును వెల్గు విభుఁడ వీవె | కావె దేవేంద్రనుత వేగ రావె బ్రోవ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

77


సీ.

రజ్జువునందు సర్పంబు ముక్తాస్ఫోట- | మందు రౌప్యంబు పైష్టాంబువులఁ బ-
యస్సు మరీచకయందు నీరంబు భ్రాం- | తి జగంబు నీయందు దృశ్యమగును
దహనునియందును దాహకత్వంబును | దపనునియందునఁ దాపనంబు
సలిలమునందున శైత్యంబుఁ బూర్ణని- | శాకరునందుఁ బ్రసన్న మట్లె


గీ.

నొగిఁ బ్రపంచంబులోపల నుండు దీవు | విష్టపమ్ములకును నీకు వేఱు గలదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

78


సీ.

ఉభయపార్శ్వముల ధాత్రూపేంద్రు లురువడి | వింజామరమ్ములు వీచుచుండ
ఛత్రమ్ము వజ్రపశ్చాత్పీఠిఁ బట్టఁ ద- | ర్పణము పురోవీథి వహ్ని నిలుప