పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/617

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

దనరు యుష్మత్సరోవరమున మునింగి | పాపసంతాపముక్తుఁడనై పరఁగెద,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

59


సీ.

రమణీయయానంబు రాజహంసలు గాఁగ | నారు మేల్తుమ్మెదబారు గాఁగ
సముచితకుచములు చక్రవాకములుగా | స్వరము వనప్రియవరము గాఁగ
నాస్యంబు పుష్కరాహ్వము గాఁగ మంజులో- | క్తులు శుకశాకుంతకులము గాఁగ
పక్షులు ఖంజరీటౌఘము గాఁగఁ గ- | చంబు సుబర్హిబర్హంబు గాఁగ


గీ.

నొప్పు ప్రాలేయగిరిజావయోవిలాస- | మరయ నీ మోహజాలమునందుఁ బడదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

60

నవరసములు

సీ.

నవవజ్రమకుటవైభవ ధాళధళ్యరు- | చుల్ శీర్షమందు సంశోభిలంగ
మండితహరినీలకుండల చాకచ- | క్యప్రభల్ గల్లభాగములఁ బొదలఁ
మాంగళ్యశోణరత్నాంగద ధాగధ- | గ్యద్యుతు లంసములందు వెలుఁగ
ముత్యాలబలుసరముల తాళతళ్యదీ- | ప్తులు నిజోరస్థలిఁ దొంగలింప