పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/615

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దాక్షాయణీ పీనవక్షోజ కాశ్మీర- | వక్షఃకవాట మహోక్షఘోట
నీహారగిరినందినీదృక్చకోరక- | రాకామృగాంక నిరస్తపంక


గీ.

కృతసురావనసంరంభ ధృతకురంగ- | డింభ సంభరితాజాండకుంభ బ్రోవు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

55


సీ.

చారుతత్పూరుషాఘోర సద్యోజాత | వామదేవేశానవక్త్రమూర్తి
సతతవరాభయాజగవత్రిశూల ప్ర- | ముఖ కరాంభోరుహామోఘమూర్తి
హేరంబ షణ్ముఖ వీరభద్ర క్షేత్ర- | పాలాది పరివృత భద్రమూర్తి
జలభూనభోనభస్వద్భాస్వదిందీవ- | రప్రియాధ్వర్యగ్ని దీపమూర్తి


గీ.

బుధజనస్తోమ సస్యనభోనభస్య | హరివయస్య నిరంతరాచరితలాస్య,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

56


సీ.

అనుదినాకర్ణనమును రోమహర్షణ- | మందని యురగత్వ మందఁగోర
శారీరమానసాక్షయ్యబాధలు గల్గి- | యుండెడు మనుజత్వ మొందఁగోర
లలితనిద్రాహారములు లేకయుండెడు | యురుతర దేవత్వ మొందఁగోర