పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/603

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఆమ్నాయహయ నీకు హంసవాహన మహా- | ననదేశములు సాహిణములు గావె
యాకాశకేశ నీ కర్ధినీబాంధవ- | ప్రముఖ గ్రహములు సుమములు గావె
ఫణ్యాభరణ నీకుఁ బాతాళలోకంబు | హాటకభూషాసుపేటి గాదె
దిగ్వాస నీకు నాదిత్యాధిపాది ది- | క్పతులు శాటీపాలకరులు గారె


గీ.

నీవు వేధోండములలోన నిండియుండ | తథ్యమే గాదె యేతద్విధంబు దెలియ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

29


సీ.

బికిరమెత్తుట మానుపింతు నీకందునా | యెద్దొక్కటే కృషి యెట్టులగును
కాఁటిలోపలఁ బండ నేఁటికి యందు ఖ- | ట్వాంగ మొక్కటి మంచమగునదెట్లు
లలిఁ బసిఁదిండి కళాసముద్యజియించు- | మందునా నిర్గుణ మనుసరించె
నస్థిహారము వలదందునా యేవంశ- | జుఁడవు మౌక్తికదామశోభ నొంద


గీ.

యేమి సేయుదుఁ దండ్రి మదీప్సితంబు | తీరదయ్యెను నా దురదృష్టమరయ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

30


సీ.

ఒకవేళఁ గుంభకారకు భంగి బ్రహ్మాండ- | భాండనిర్మాణతత్పరుడవగుచు