పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/598

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఏ మహాత్మునకును హేమావనీధ్రంబు | రమణీయకార్ముకరాజమయ్యె
నే కృపానిధికి రత్నాకరశ్రేష్ఠంబు | నిరవధికోరుతూణీరమయ్యె
నే గుణాఢ్యునకును బాగొప్ప నవనిధీ- | శ్వరుఁ డనారతబద్ధసఖ్యుఁడయ్యె
నే శాంతఖనికి లక్ష్మీశుండు నిజనేత్ర- | పద్మపూజ యొనర్చి భక్తుఁడయ్యె


గీ.

నింతవానికి నగ్నత్వమేలఁ గల్గె | నేమి మర్యాదొ తుదమొద లెఱుఁగరాదు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

18


సీ.

శ్రీమజ్జగద్గురునామధేయుఁడవయ్యు | నురుగణపాల శిష్యుండవైతి-
వభవుఁడవయ్యును విభవం బెలర్పఁగ | భల్లాణనృపతికిఁ బట్టివైతి
చర్చింప నీశ్వరశబ్దవాచ్యుఁడవయ్యు | బాణాసురునకును భటుఁడవైతి
మిత్తిని గెలిచిన మేటిశూరుఁడవయ్యు | సితవాహునకుఁ బరాజితుఁడవైతి


గీ.

సామి నీ భక్తసులభత యేమి చెప్పఁ - | జిత్రమో యప్ప సతతపోషితకకుప్ప,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

19


సీ.

సద్భక్ష్యభోజ్యచోష్యములు భుజిష్యుల- | కిచ్చి క్ష్వేళము భుజియించినావు