పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/594

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కాంచన మొక్కటి కటకాంగదాది నా- | నావిధోజ్జ్వలభూషణములు వేఱు
గోక్షీర మొక్కటి గోసమూహమునకు | కృష్ణసితారుణాకృతులు వేఱు
మృత్తిక యొక్కటి మేదురస్వేద నీ- | స్థాలీశరావఘటాలి వేఱు


గీ.

గరిమఁ బరమాత్మమూ ర్తి యొక్కరుఁడ వీవు | కాయములు భిన్నరూపముల్ గావె తలఁప,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

9


సీ.

విమలభవత్కథల్ వినని కర్ణములు క- | ర్ణములా పురాణకూపములు గాక
త్వన్మూర్తిఁ గనని నేత్రములు నేత్రంబులా | చాలినీకుహరసంచయము గాక
భక్తితో మిము నుతింపని రసజ్ఞ రసజ్ఞె | ఘనతరాయసఖజాకంబు గాక
మిముఁ బూజ సేయని మృదులహస్తములు హ- | స్తములా దారుహస్తములు గాక


గీ.

నిజపదానతకృతబోధనిర్నిరోధ | కుటిలవర్గమృగవ్యాధ గురుసుమేధ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

10


సీ.

ఆశ్రితకల్పక మంచు స్థాణువు నెట్టు- | లింద్రాది సురలాశ్రయించి రొక్కొ
స్త్రీపుంనపుంసకరూపహీనున కెట్లు | పురుషో త్తముఁ డొనర్చెఁ బూజనంబు