పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/588

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈ విశ్వనాథశతకము వ్రాసిన కవి అమలాపురము సన్యాసికవి. ఈయన నివాసస్థలము విశాఖపట్టణమండలాంతర్గతమగు పాల్తేరు. కవితానుకులాలకుల సంభూతుఁడ ననియుఁ, గాశీపతికి గంగాభవానికి గుమారుఁడ ననియుఁ, దన పత్నియగు కన్నమ్మతోఁ గలసి కాశీనగరమున కేగి విశ్వేశ్వరునిగూర్చి యీ శతకము రచించెననియు శతకాంతమునఁగల పద్యముల వలనఁ దెలియుచున్నది.

ఈ కవి శతకములను నూరింటికిఁ బైగ రచించెననియుఁ, గట్టమూరి కామేశ్వరకవి శిష్యుఁడనియు, రామాయణము రుద్రాక్షమహత్వము లోనగు గ్రంథములు రచించెననియుఁ గవిశిష్యులలో నొకరగు దేవులపల్లి చంద్రశాస్త్రిగారు రచించిన మాలికవలనఁ దెలియనగును.

ఈ సన్యాసికవి శాలివాహనశకము 1782 సరియగు క్రీ.శ. 1860లో జనించినటులఁ గవికి శిష్యుఁడగు దేవులపల్లి చంద్రశాస్త్రిగారు రచించిన యీ క్రింది పద్యమువలన స్పష్టముగాఁ దెలియుచున్నది.


సీ.

తన వంశకర్తయై తనరారు శాలివా- | హనమహారాజు శతాబ్దములు క-
రగజర్షివిధుసంఖ్యఁ దగు రౌద్రివత్సర | చైత్రశుద్ధ నవమి మిత్రపుత్ర