పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/200

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకము రచించిన కవి దిట్టకవి రామయోగి దీక్షితులు. ఇతఁడు కాశ్యపగోత్రుఁడు. నందిగామ తాలూకా గొట్టుముక్కలనివాసి, చిరకాల మీకవి నూజనీటిలో నారయప్పారావు బహద్దరు వారి యాస్థానమునందుఁ బౌరాణికుఁడుగ నున్నటులఁ గవివంశీయులు చెప్పుచున్నారు. ఇక్కవి రంగారాయచరిత్రము రచించిన నారాయణకవిమనుమఁడు. ఈయనతండ్రి సుందరరామసూరి. తాత యాదవరాయకవి. జనకపితామహుల ప్రతిభావిశేషములు తెలియవు.

రామయోగికవి సంస్కృతమున నసాధారణపండితుఁడు. ఒకమా టీకవి తమ ప్రభువర్యునితోఁ గాంచీనగరమున కేగి యటనున్న మహాపండితులతో వ్యాకరణశాస్త్రమునఁ జాలదినములు వివదించి విజయ మంది బ్రహ్మరథము పీతాంబరసత్కృతి నూటపదియాఱురూపాయలు సభాసత్కారము సేలువులు బహూకృతి పొంది గృహాభిముఖుఁ డాయెనఁట. నాఁడు మొదలు నేఁటివఱకుఁ గాంచీనగరవాసులు