పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/164

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్దండరాయశతకము

153


క్షజ నిన్నే నెదనమ్మినాఁడ నిఁక మత్కాలుష్యముల్ బాఱఁజి
మ్మ జుగుప్సల్ బెడబాప కర్తవు జుమీ మద్దాలి...

41


మ.

గజవక్త్రుండు భుజంగమాధిపతి గంగాద్వీపినీభర్తనీ
రజసంజాతుఁడు భారతీసతియు నీప్రాంచత్కథల్ బ్రేమసా
మజటాగానముల భజింతు రెపుడున్ మద్దాలి...

42


మ.

యజురాదిశ్రుతులెల్ల నిన్ బొగడు నాహా యండ్రు నీకీర్తి క
య్యజుడున్ భారతి నీదుతారకము జిహ్వాగ్రంబులన్ మేనకా
త్మజయున్ శంభుఁడు దాల్చి పొంగుదురు శ్రీమద్దాలి...

43


మ.

విజితత్వంబున నొంద దీషణదవావిర్భూతి యోహో చతు
ర్భుజ తచ్ఛాంతికి తావకీనకరుణాపూరంపుఁబాలేటిచె
మ్మజుమీ నమ్మినవాక్షికాంబుద మిఁకన్ మద్దాలి...

44


మ.

గిజిగా డెట్టులొ యట్లజీవుఁడును దద్గేహంబె దేహంబు త
ద్విజ మాలోపల జ్యోతినుంచుకొని యుద్దీపించునట్లే యజి
హ్మజగజ్జ్యోతిని నిన్నుఁ గాంచవలె లో మద్దాలి...

45


మ.

గజగండస్థలివోలె నెమ్మన మశక్యంబైన దుర్వాంఛ పే
రిజిలం దూలెడు దీని మాన్ప భవదంఘ్రిస్వర్ద్రుమూలైకసీ