పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/160

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్దండరాయశతకము

149


మ.

సృజియింపన్ సృజియించి మేలొసఁగ నిర్జింపం బ్రజామానసాం
బుజవాంఛల్ సఫలం బొనర్ప విఫలంబుం జేయనీవేని కా
మజగద్భారకమూలకర్తవు భళీ మద్దాలి...

20


మ.

సుజనత్వంబరిదేహిమత్తుఁడయి సంక్షోభింపఁగా నేల ని
త్యజుగుప్సాస్పద మాజవంజవసుఖం బాహా భవద్దివ్యనా
మజపం బేమర కాత్మ నిల్పవలె శ్రీమద్దాలి...

21


మ.

యజనామ్నాయతపోజపవ్రతము లత్యంతంబు వర్ధిల్ల భూ
ప్రజ కానంద మమందమై పరగి సంపత్పారిజాతంపుఁగొ
మ్మ జిగుర్పం గరుణించుకర్తవు గదా మద్దాలి...

22


మ.

గజ మేదేశికునొద్ద శిక్షఁ గనె సాకల్యంబుగాఁ గుబ్జ యే
ద్విజు నాచార్యుని గాఁగఁ జేకొనె భవద్దివ్యామృతప్రాయనా
మజపప్రాప్తికి సాత్వికంబె గురువౌ మద్దాలి...

23


మ.

అజనుఃశ్లాఘ్యసుఖంబు గైకొనెద భూయఃస్వాయదానందనం
దజనీసత్వగుణస్ఫురత్స్ఫటికరత్నంబందు మత్పూర్వక
ర్మజపారోచులలోఁ గొనంగదవె శ్రీమద్దాలి...

24


మ.

ధ్వజమై వాహనమై పతంగపతి గొల్వ న్ బిల్వరాసెజ్జయం