పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/155

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

ద్ధమగునామముగాని యాంధ్రలోకము ఎఱుంగకుంట పరితాపకరము.

రామచంద్రకవి నూజవీటిప్రభువుల సంస్థానములోనిదగు మద్దాలి కేఁగి యటఁ గలయుద్దండరాయస్వామినిగూర్చి యీశతకమును రచించెను. శతకమునందు భక్తిరసము ప్రధానస్థానము నొందియున్నది. శతకమంతయు జకారప్రాసముతోనున్న ప్రాసస్థానములలోఁ గవి వెదకికొనక క్రొత్తపదములను సందర్భశుద్ధిగా సమకూర్చి తనకవితాప్రాగల్భ్యము వెల్లడించియున్నాఁడు. ఈశతకమునందలి పద్యభావములుగూడ మనోహరభక్తజనహృదయాకర్షణముగానున్నవి. ఈకవి సాహిత్యమందేగాక యద్వైతమతసిధ్ధాంతములందుఁ గూడ జితశ్రముఁడని యీశతకమునందలి పద్యములు చెప్పుచున్నవి.

మా3కుఁ బూర్వతాళపత్రగ్రంథమును బట్టి వ్రాయఁబడిన వ్రాతప్రతి జీర్ణమయమైనది లభించినది. ఇంక నుపేక్షించిన నీప్రతిగూడ నదృశ్యమగునేమో యని ప్రత్యంతరసహాయము లేకున్నను ఎటులో శుద్ధప్రతి నొకవిధముగా సిద్ధపఱచి ముద్రణమునకు నొసంగఁగలిగితిమి. ద్వితీయముద్రణమున శతకమును సర్వవిధముల సంస్కరింపవలెనని యున్నది.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు

5.2.25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.