పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

శంబుక వధ

        నీతి యగునా ! రాజధర్మము ప్రజలను నిష్పాక్షిక మయిన బుద్ధితో
        బరిపాలించుట కాదా ?

వ: శ్రీ రామచంద్రా ! ఇందొక్క జాతి స్వత్వమును హరించి బానిసలుగా
        నుంచుటయే మున్నది. వీరు మీపూర్వులలో నడుము కట్టుకొని
        పోరి తమహక్కులను గోల్పోయిరి. పరాభూతులయిన శత్రువులు
        లోబడిరని చెప్పి స్వత్వసామాన్యము నొసంగుట, రాజనీతి విరుధ్ధము

శ్రీ:- మహాత్మా ! శరణాగతరక్షణ బిరుదంబు దాల్చిన మాకు బావా
        క్యములు బోధపడవు. మీయుప దేశ ప్రకారము మేమాచరించిన
        భవిషదంత ర్వాణులు మమ్మీమిగా భావింతురు ?

వ- మహాపురుషుఁడవనియు, రాజ దేవేంద్రుఁడ వనియు , భగవదవ ..
        తారమనియు భావింతురు.

శ్రీ.. ఇది యెట్లు తటస్థించును ?

వ:-- ఇది యెట్లు తటస్థించునని సంశయచిత్తుడ వైతివా ! వినుము
        చెప్పెదము. ఇంతటి నిర్దాక్షిణ్యముతో రాజధర్మమును నెవ్వరు
       నిర్వర్తింపగల్గిరి : ఇంతటి ధర్మబుద్ధితో స్మార్తధర్మమునునెవ్వరు పరి
       పాలింపఁగల్గిరి! నీవిట్టి ధర్మనిర్వహణము. జేయచో ఋషు లేల
       నిన్ను భగవదవతారముగాఁ గొనియాడరు? వర్ణాశ్రమాచార పరా
       యణశీలుఁడయిన రాజు నిమిత్త మాత్రుఁడై వర్ణ సాంకర్యము గల్లు
       జేయు వారల శిక్షించునని స్మృతులు చెప్పుట లేదా ? లెమ్ము.

శ్రీ:- నా కెంత చెప్పినను శంబుకుని వదకు మనసు పోకున్నది. ఇతఁడు
       నిరఫరాధియని మావిశ్వాసము,