పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

శంబుక వధ

 
         కటాక్షమునఁ బవిత్రుడనైతి, ఆర్హులపాలిటి దైవతములుగదా
        భూనాథులు , మీ యీమహత్కార్యముచే ద్రావిడలోక మెల్ల
        నాచంద్రార్కము కృతజ్ఞ మైయుండును.
.
శ్రీ:- మేలు మీరాజభక్తిచే మేము సంప్రీతుల మయితిమి .
       (నిష్క్రమింతును.)

(గుర్రము పై నానుకొన్న శ్రీరామచంద్రుడును, వసిష్ఠుడును)

వ:- శ్రీరామచంద్రా ! కార్యవర్యవసానమును దెలిసికొనుటకునై
      యీకడకను దెంచితిని, ద్రోహని శిక్షించితివి కదా !

శ్రీ:-ద్రోహుల శిక్షాపాత్రులఁ జేయుటకు నయోధ్యపట్టణాధీశులం
     దెవ్వరను జంకు వారు కారు.

వ: తరతరంబు నుండి యీసంగతి మమెఱుంగనిది కాదు. అందు
     చేతనే సూర్య వంశ పౌరోహిత్య మునందు సుస్థిరులమయి యున్నా
     రము. గుర్వాజ్ఞను దలపూపట్టులమన్నింపని ఛాత్రులుమన్ననకుఁ
     బాత్రులుగారు. గుర్వాజ్ఞకు బ్రశ్నింస కుండ నొనర్చుట శిష్యధర్మ
     ము. ఈగురు శిష్యధర్మమిప్పటిదియా ! సృష్ట్యాది నుండి పరం పరా
     నుగతిక మయినది. ఇన్నిటికిని మఱచితి.శంబుకుని శిష్యుల
     నందఱి నెక్కడికంపితివి? వారలకు గూడఁ నల్పశిక్షయయిన విధిం
     పవలసినదియే.

శ్రీ: ఇచ్చటనే యీ చిదానం దాశ్రమములోనే యున్నారు.

వ:ఎక్కడనుండిన నేమి గాని కట్టుదిట్టములు చేసితివి కదా ! కన్నులు
    గానక . మిట్టిపడి వర్ణాశ్రమా చారముల దిగ ద్రావి చెల రేగిన గురు
    వునకుఁ బట్టిన గతి యేపట్టునని ఖుడితముగాఁ జెప్పితివా ! ఈదురా