పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

శంబుక వధ

 
శ్రీ:- అట్లయినచో వినుఁడు. మీరు కొన్ని నాళ్ల నుండి చేయ చున్న
        హితోపదేశములును, మతోప దేశమలును మాశ్రవణ విచారణ
        ముగనున్నది. మహా ఋషులందరును , స్కృతికర్తలెల్లరును మీకు
       మత వ్యాసంగమునకు నధి కారము లేదనిని చెప్పుచున్నారు. కాని
        మీరా వాక్యములను బెడచెవులను బెట్ట చున్నట్టున్నది.

శ :- దేవా ! మన్నింపుడు. ఎందుచే సధికారము లేదని చెప్పు
       చున్నారు?

శ్రీ:- శూద్రులకు వేదములను జదువుటకుఁ గాని ముట్టుటకు గాని
      యధికారము లేక పోవుటయే కాక మతప్రసంగమును జేయుటకు
       గూడ నధికారము లేదు. బాహ్మణులు చెప్పిన నీతులను గ్రహింప
      వలయును గాని ప్రశ్నింపరాదు” అని వీరివాదము. దీనికిమీరేమి
      ప్రత్యుత్తరము. జెప్పెదరు ?

శం:-ఇందు రెండు సంగతులు విచారింపదగి యున్నవి. ఆ యెవ్వి
      యంటి రేని, చెప్పెద సావధాన మనస్కులరై వినుడు. మొట్ట
       మొదటిది మేము శూద్రశ్యవాచ్యుల మెట్లగుదుము : ఆశబ్ద
       మును మా మెడ కేల యంటఁగట్టెడరు ! మేము ద్రావిడులము.
       మానామములు మాకున్న యవి మాపూర్వులు పరాజితులయినంత
       మాత్రమున నిష్టము వచ్చిన నామములచే మమ్ము వ్యవహరించుట
       పాడియా? అయిన దీనితో నేమి ? భిన్న నామములచే వ్యవహరిం
       చినంతనే పదార్థములు నైజధర్మమును విడనాడవుకదా; ఇక రెండ
       వది, మాకు మత ప్రసంగమునకే యధికారము లేదను చున్నారు.
       ఇది యెవ్వరి యాదేశము, కారణ మేమి చెప్పెదరు ?

శ్రీ:- ఋషుల యా దేశము, స్మృతుల యభిప్రాయమును, " ఋషుల

.