పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/85

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

శంబుక వధ.


 
     సంస్కృతము న్చేకొనుట మిగుల కష్టము. మొన్న మా బాబ
     య్యగారు వ్యాకరణ మారంబిం చెదమని చెప్పినారు.. అప్పటి
     నుండియు నాకుజెప్పరాని ఆనందముబుకు చున్నది.

శ్రీ:- అంత సంతోషముగా నున్నదిగా . మంచిమాటయే. నీ కేమ
      యినఁగావయు నేమో చెప్పుము. మేమిచ్చెదము.

బ్ర:బ్రహ్మచారులకుఁ గోర్కెలేముండును. విద్యా వ్యాసంగము
     దక్క? అవిద్యను బాబయ్య గారు చెప్పుచునే యున్నారు . అయి
     నను నితరులనుండి యేవస్తువయినను నూఱక తీసి కొనుట దోషమని
     బాబయ్య గారు చెప్పుచు చుందురు. వారికిఁ గోపమువ చ్చుపని
     జేయజాలను.

శ్రీ: మేమిచ్చిన వస్తువును దీసికొన నొల్లవా ?

బ్ర: నూబాబయ్యగారిష్ట పడిన యెడల.

శ్రీ:- అట్లయిన మా బాబయ్యగానిని గను గొందును గాని నీవుపోయి
      మేము వచ్చితిమని తెలియఁ చేతువా ?

బ్ర- చిత్తము. సంశయమెందులకు ? (నిష్క్రమింతురు)

ఖర్జూర వనము



     (పీఠముపై - శ్రీరామచ ద్రుఁడుపవిష్టుడగును. శిష్యగణపరి
     వృతుఁడై శంబుకర్ష సమీపమునఁ గూర్చుండును.)

శం:దేవా! మాయాశ్రమము నేటికి గదా పవిత్రమైనది. మీకాతి
     థ్యము నోసంగి మేమును జరితార్థుల మైతిమి.

శ్రీ: సంయమీంద్రా ! మిమ్ములను దర్శించి మేముకు బరితుష్టుల