పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/84

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 
శ్రీ:- (బ్రహ్మచారిని దగ్గరకు దీసీ) కుమారా ! నీవలన దోషము లేదు.
        నీమాటలవలన మాకానందము గల్గుచున్నది. రాజాధి రాజులను
        సందర్శించునప్పుడె ట్లు చరియింపవలయునో గురువుగారు చెప్ప
        లేదా ! రాజాధి రాజును గుర్తించు విధమయినను చెప్ప లేదా ?

బ్ర: –దేవా ! లేదు. మిమ్ములను రెండవమాఱుచూచినప్పు డెవ్వరో
       "గొప్పవారను కొన్నానుగాని, మరల గొప్పవారు మాయాశ్రమము
       న కెందుకు వత్తురాయని--.

శ్రీ:- నీ బేలతనము మమ్మానందముపాలు చేయుచున్నది. మీగురువు
       గారునీ కేమియుఁ జదువు చెప్పరా? చిన్నవని కాఁబోలు.

బ్ర:-స్వామీ ! అట్లు కాదు. అట్లు కాదు. నన్ను బోలు చిన్నలకుఁ
      బొద్దుననే సంధ్యావంద నాదులఁ దీర్చికొనినయనతరమ', భగ
      వంతునిగూర్చి కొన్ని కొన్ని సంగతులు చెప్పుదురు, ఆవల
      మేము పాఠములను జదువు కొనుటకుఁబోవుదుము. మధ్యాహ్న
      సమయమున వైయాకరణుల తోడను, మీమాంసకుల తోడను
      బ్రసంగముఁ గావించు చుందుము.

శ్రీ: మీ గురువుగారు మిమ్ముల నెప్పుడయినఁ గోపపడుచుందురా ?

బ్ర:-దేవా ! లేదు. ప్రసన్న వదనముతో మాటాడుచుందురు. గురు
      వుగారని పిలువము. బాబయ్య గారిని పిలుచు చుందుము.
      మమ్ములఁ జూచుట తోడనే చిరు నవ్వు నవ్వుచుఁ గబురులు చెప్పు
      చుందురు. , 'బాబయ్య గారిని జూచుట తోడనే మాకు సంతోష
      ముప్పొంగి వచ్చును..

శ్రీ:- సరే ! అటులనా ! నీవిప్పుడేమి చదువుకొను చున్నాఁడవు !

బ్ర:- సంస్కృత భాషాబంచయమును గల్గించు కొనుచున్నాడను.