పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/80

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శంబుక వధ


(ఉత్తరరామచరిత)

చతుర్థాంకము,

-:0:-

(శ్రీరామచంద్రుని ప్రవేశము)

 
శ్రీ:- అబ్బా ! రాజ్య మేలుట కత్తి మీది. సాముగదా !

గీ|| తెలిసి యపచార : మిసుమంత , సలుపకుండ
        జపముఁ జేసికొనుచు నుండు' • సాధువులను
        బట్టి వర్ణాశ్రమాచార • పాలనంబఁ
        టంచు బరిమార్పగా నచ్చే • నక్కటకట

       ఇందుచేత నే తొల్లింటి పుణ్యమూర్తు లగు ఋషులు “రాజ్యానం తే
       నరకమ్ ధ్రువ..” అని నుడివిరి. రామరాజ్యమునం దే యిట్టి చిత్ర
       ములు జరుగవలయునా ! శంబుకుని శిక్షింపకున్న యెడల వంశగురు
       వున కేమి యలుకవచ్చునోకదా !

       రాజ్యరక్షణ విషయమై రాజు జాలి
       బూనఁదగదంచు గురుమూర్తి యానతిచ్చె
       తత్వజిజ్ఞాసుల కంఠనాళ
       ములనుగోసి రాజ్యముఁ జేయఁ బోవ లేను ....2

"