పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/77

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

శంబుక వధ.


             వేదాధ్యయన, అధ్యాపక ప్రముఖ బ్రాహ్మణాను ష్టేయములకు
             స్వత్వమున్నదని శిష్యులం గూర్చి బోధింపుచు మతద్రోహముఁ
             గావింపుచున్నాఁడవని మాశ్రుతిపథమునఁ బడినది. మేము ధర్మ
             మాగ్గానుచరులమగుటచే సభాముఖంబున నీస్వత్వమును రూఢి
             పఱచుకొనుట కధికారమిప్పించు చున్నాము. కాన 'ఱేపు మూఁడు
             యామములకు నొడ్డోలగము జరుగ నై యున్నది.
            వేదాంగ పారంగతులను, సర్వశాస్త్ర నిష్ణాతులను రప్పించు
            చున్నాము, స్మృతి విహిత ధర్మ తిరస్కారులకు మరణదండన శా
           స్త్రచోదితమని తెలియ జేయుచున్నాము. (శిష్యుడుగురువును
            దేజీ పాఱుఁ జూచుచుండును. )

శం:- కుమారా ! నీయుదేశ్య మేమి ? ఈపండిత పరిషత్తునకు శాస్త్ర,
          చర్చకయి పోదుమా?

శి: పోవుటయే యుచితమని తోచుచున్నది. రహస్యముగ మన
          మెన్ని బోధించిన నేమి? ఎన్నటిఁకయిన మన వాదము బహిరంగము
          కావలసియే యున్నదికదా. కానఁ దరుణము వచ్చినప్పుడు మన
          మేల వెనుకాడ వలయును ? ధర్మాధర్మ విచక్షణకర్త యగు శ్రీ
          రామప్రభుని మధ్యవర్తిగ నుంచికొని యూర్యులతో ముఖాముఖి
          శాస్రవాదము సల్పి, యొడిచిపుచ్చి, మన హక్కులను బలిమి మై
          గుంజుకొని నిలువం బెట్టుకొనుట యుచితమగుటయే కాక నాకు
          బరమ సమ్మతము.

శం:- నాయనా ! కార్యములు మాటలంత సుకరములు కావు. పై పెచ్చు.
         తెఱచాటుననున్న . మహానుభావుఁ డెవ్వడో యెఱుంగుదువా?
         వసిష్ట మహాముని. ఈవాక్యము లెవ్వరివని నీయాలోచనము ?