పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

శంబు క వధ .


 
శ్రీ:-చిత్తము.

వ: అంచుచే నీపట్టణంబున, నీసాకేతంబున గర్వగ్రస్తులై శూద్రు
     లు బ్రాహ్మణు)ను దిరస్కరించుట యేకాక వేదాధ్యయనంబునకు
     గూడఁ గడంగు చున్నారు.

శ్రీ:- ఇప్పుడు మా కేమి యాదేశము ?

వ: ఈ దేశమునీది కాదా ?

శ్రీ:- మాదియే.

వ:- అటులయిన వర్ణాశ్రమాచారములను నిల్పనొల్లవా !

శ్రీ- నిల్పబద్ధ కంకణులము, గాని మమ్మేమి చేయమందురు ?

వ- నీ రాజ్యమునకు రానున్న యీప్రమాదమును, నీముప్పును
     వైళమ తొలగింపవా?

శ్రీ: దానికి సందియ మేల! నేడే వర్ణాశ్రమాచారముల ధిక్కరించి
     విచ్చలవిడి వర్తించు వారల నిష్ణువ దండన పాలుచేసెద
     నని శాసనమును బ్రచురించెదము.

వ: ఇట్టి శాసనమువలన నుపయోగము లేదు. ఇది తాత్కాలికోపశ
     మనముగల్గఁ జేసినఁ గల్గ జేయును. కాని శాశ్వతముగా నీయుప
     ద్రవమును దప్పింప జాలదు. ద్రావిడు లందుడ్భవించిన యీయా
     వేశమును సశాసనమప్పటికి నణచి పెట్టినను, లోన గుమిలి గుమిలి
     యెన్నటి కయిన బయల్వడకమానదు. ముందు మేల్కొనుట
     మేలు. ఒకరినిర్వురం బట్టి శిక్షించిన నుపశమిల్లునని తోచును.

శ్రీ:- ఎవ్వరికి "నేశిక్ష విధించ మందురు ?

వు..ఎవ్వరిని శిక్షించిన నేమిలాభమున్నది! సామాన్యదండనము వలన
     మాత్రమేమి యుప యోగమున్నది. ఈమత ద్రోహుల గురువునుం